Chiranjeevi: ఎందుకన్నయ్యా.. మాకు దూరమైపోయావ్?

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా చిరంజీవి ఆయనకు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

Published : 04 Jun 2021 20:48 IST

ఎస్పీబాలు జయంతి.. చిరు ట్వీట్‌

హైదరాబాద్‌: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా చిరంజీవి ఆయనకు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ రోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి 75వ జయంతి. ఎస్పీబీగారికి నివాళులర్పిస్తున్నారు. ‘బాలు గారు’.. అని అంటుంటే నాకొక సంఘటన గుర్తుకువస్తుంది. ఓసారి ‘బాలుగారు’ అంటూ ఆయన్ని మర్యాదగా పిలిచాను. దానికాయన.. ‘ఏమైందయ్యా నీకు.. చక్కగా అన్నయ్యా అని పిలిచేవాడివి. ఇప్పుడు ఎందుకు ‘బాలుగారు’ అని మర్యాదగా పిలిచి నన్ను దూరం చేస్తున్నావని అన్నారు చిరు కోపంతో. మీ గొప్పతనం, ఔన్నత్యం తెలుసుకున్న తర్వాత మీలాంటి వారిని ఏకవచనంతో పిలవలేకపోతున్నానని చెప్పాను. దానికి ఆయన.. అలా పిలిచి నన్ను దూరం చెయ్యకని అన్నారు. ‘దూరం చెయ్యకని మమ్మల్ని హెచ్చరించి మరి, నువ్వెందుకు అన్నయ్య మాకు దూరమైపోయావ్? సంగీత ప్రియులు, అభిమానులు, ఆత్మీయులకు, ఈ సంగీత లోకానికే అన్యాయం చేసి ఎందుకు వెళ్లిపోయావు? నీకు అంజలి ఘటిస్తూ మన సోదరి వసంత లక్ష్మి.. తన ఆవేదనని తెలియజేస్తూ ఓ పాట పాడింది. చెల్లిపాట నీ గుండెను తాకుతుంది.. నువ్వు స్పందిస్తావు. దీవిస్తావని చిరు పేర్కొన్నారు. చిరంజీవి మాత్రమే కాకుండా పలువురు సినీ గాయనీ గాయకులు, నటీనటులు సైతం ఎస్పీబాలు జయంతి సందర్భంగా నివాళులర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని