Andrea Jeremiah: గన్ పట్టిన జాస్మిన్
వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘సైంధవ్’ (Saindhav). వెంకట్ బోయనపల్లి నిర్మాత. నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నారు.
వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా శైలేష్ కొలను (Sailesh Kolanu) తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘సైంధవ్’ (Saindhav). వెంకట్ బోయనపల్లి నిర్మాత. నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన నాయికగా నటిస్తుండగా.. రుహాని శర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ల పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లు ఇప్పటికే విడుదలయ్యాయి. కాగా, ఇప్పుడు ఇందులో కనిపించనున్న మూడో నాయికను పరిచయం చేసింది చిత్ర బృందం. నటి ఆండ్రియా ఈ చిత్రంలో జాస్మిన్‌గా నటిస్తుందని తెలియజేస్తూ.. ఆమె ఫస్ట్‌లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రంలో ఆండ్రియా తుపాకీ పట్టుకొని సీరియస్‌గా చూస్తూ కనిపించింది. దీన్ని బట్టి సినిమాలో ఆమె పాత్ర యాక్షన్ కోణంలో సాగనున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కూర్పు: గ్యారీ బిహెచ్, ఛాయాగ్రహణం: ఎస్.మణికందన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Justin Trudeau: ‘మేం చేసింది ఘోర తప్పిదం.. క్షమించండి’: కెనడా ప్రధాని ట్రూడో
-
Balapur Laddu Auction: అత్యధిక ధరకు బాలాపూర్ లడ్డూ.. ఈసారి ఎంత పలికిందంటే?
-
Nitish kumar: మనం బ్రిటీష్ కాలంలో జీవించట్లేదు కదా.. ఆంగ్లంలో డిజిటల్ సైన్బోర్డ్ ఏర్పాటుపై మండిపడ్డ నీతీశ్
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ జాగీర్ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్