Allari naresh: అల్లరి నరేశ్‌ హీరోగా ‘బచ్చల మల్లి’ ప్రారంభం

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా ఆయన 63వ చిత్రం హాస్య మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతోంది. అమృత అయ్యర్‌ కథానాయిక. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 02 Dec 2023 09:43 IST

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా ఆయన 63వ చిత్రం హాస్య మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతోంది. అమృత అయ్యర్‌ కథానాయిక. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మాతలు. ‘బచ్చల మల్లి’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్‌ రావిపూడి క్లాప్‌నివ్వగా, ప్రతాప్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. విజయ్‌ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. మారుతి, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ని చిత్రబృందానికి అందజేశారు. ‘‘1990 నేపథ్యంలో సాగే చిత్రమిది. కొత్తతరం యాక్షన్‌ డ్రామాగా, ఓ విభిన్నమైన కథతో తెరకెక్కుతోంది. అల్లరి నరేశ్‌ కొత్త రకమైన లుక్‌లో, గాఢమైన పాత్రలో కనిపిస్తారు. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నార’’ని చిత్రవర్గాలు తెలిపాయి. కోట జయరామ్‌, రోహిణి, రావు రమేశ్‌, సాయికుమార్‌, ధనరాజ్‌, హరితేజ, ప్రవీణ్‌, ప్రసాద్‌ బెహరా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ఎం.నాథన్‌, కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: బ్రహ్మ కడలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని