Allu Arha: అర్హ ముద్దు ముద్దు మాటలు.. వీడియో వైరల్‌

తన కుమార్తె అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు నటుడు అల్లు అర్జున్‌. ఆమెకు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేశారు.

Published : 21 Nov 2022 15:38 IST

హైదరాబాద్‌: తన గారాల కుమార్తె అర్హ (Arha) ముద్దు ముద్దు మాటలకు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) మురిసిపోయారు. అర్హ పుట్టినరోజు పురస్కరించుకుని సోమవారం ఆయన ఓ వీడియో షేర్‌ చేశారు. ఇందులో ఆమె.. తమ నివాసంలో కందిరీగలు ఉన్నాయని, అవి దాడి చేశాయని.. కంగారుపడుతూ ముద్దు ముద్దుగా చెబుతూ కనిపించింది. ఆమె మాటలకు ఆనందించిన బన్నీ.. ‘ఎందుకు అంత భయపడుతున్నావ్‌?’ అని ప్రశ్నించగా.. ‘ఎందుకంటే అవి కుడుతున్నాయ్‌. ఇన్ని ఉన్నాయ్‌’ అంటూ వచ్చీరానీ మాటలతో సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అర్హకు సంబంధించిన క్యూట్‌, ఫన్నీ వీడియోలను బన్నీ అప్పుడప్పుడూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంటారనే విషయం తెలిసిందే. మరోవైపు, గుణ శేఖర్‌ తెరకెక్కిస్తోన్న ‘శాకుంతలం’తో అర్హ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని