Bigg Boss Telugu 5: దిమ్మతిరిగే ప్రశ్నలడిగిన ప్రేక్షకులు.. హౌస్‌మేట్స్‌ సమాధానం ఏంటి?

తమను గెలిపించాలని కోరుతూ ప్రేక్షకులను ఓటు అడిగే అవకాశం ఇంటి సభ్యులకు ఇచ్చాడు బిగ్‌బాస్‌ ‌(Bigg boss telugu 5)

Published : 10 Dec 2021 18:14 IST

హైదరాబాద్‌: తమను గెలిపించాలని కోరుతూ ప్రేక్షకులను ఓటు అడిగే అవకాశం ఇంటి సభ్యులకు ఇచ్చాడు బిగ్‌బాస్‌ ‌(Bigg boss telugu 5). అయితే, స్పెషల్‌ టాస్క్‌ల్లో పాల్గొని అలరించిన వారికే ఆ అవకాశం దక్కుతుంది. ఇందులో భాగంగా సినీ నటుల గెటప్‌లు ధరించి వారిని అనుకరించాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో చిరంజీవిగా శ్రీరామ్‌, బాలకృష్ణగా సన్నీ, శ్రీదేవిగా కాజల్‌, పవన్‌ కల్యాణ్‌గా మానస్‌, జెనీలియాగా సిరి, సూర్యలా షణ్ముఖ్‌ గెటప్‌లు ధరించారు. ఈ క్రమంలో వీరందరూ కలిసి ఓ టాస్క్‌ చేయాల్సి వచ్చింది. తన ఉంగరం పోయిందంటూ శ్రీదేవి గెటప్‌లో ఉన్న కాజల్‌ అమాయకంగా అడగటం, అందుకు పోలీస్‌ ఆఫీసర్‌ సూర్య గెటప్‌లో ఉన్న షణ్ముఖ్‌ గద్దించడం నవ్వులు పూయించింది. ఈ క్రమంలో బాలయ్య గెటప్‌లో ఉన్న సన్నీ తీర్పు చెప్పే ప్రయత్నం చేయగా, ‘సూర్యను ఇంప్రెస్‌ చేస్తే అంగుళీకం లభిస్తుంది’ అని అనగా.. సిరి వెంటనే షణ్ముఖ్‌ను హగ్‌ చేసుకుంది. అది చూసి కాజల్‌ ‘అయ్‌పాయే’ అనడం, ఆ తర్వాత ఇంటి సభ్యులందరూ ఆనందంతో డ్యాన్స్‌  చేయడం అలరిస్తోంది. ఇక హౌస్‌మేట్స్‌ కోసం ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలను బిగ్‌బాస్‌ డిస్‌ప్లే చేశాడు. మరి వాటికి హౌస్‌మేట్స్‌ సమాధానం ఏంటో తెలియాల్సి ఉంది.

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని