Bubblegum: రోషన్‌ కొత్త నటుడనిపించడంలేదు: ‘బబుల్‌గమ్‌’ ఈవెంట్‌లో హీరోల సందడి

‘బబుల్‌గమ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోలు విశ్వక్‌సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్‌, డైరెక్టర్‌ నందినిరెడ్డి సందడి చేశారు.

Published : 25 Dec 2023 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజీవ్‌ కనకాల- సుమ తనయుడు రోషన్‌ (Roshan Kanakala) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’ (Bubblegum). మానస చౌదరి కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. హీరోలు అడవి శేష్‌ (Adivi Sesh), విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy) ముఖ్య అతిథులుగా హాజరై, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

‘‘రోషన్‌ చాలా లక్కీ అని అనుకుంటున్నా. అతడి సినిమా విజయం అందుకుంటే ఆనందించే వారిలో నేనొకడిని. ట్రైలర్‌లోని రోషన్‌ నటన చూస్తే కొత్తవాడిలా అనిపించట్లేదు’’ అని విశ్వక్‌ సేన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ట్రైలర్‌ చూడగానే ఈ సినిమా హిట్‌ అవుతుందనుకున్నా. రోషన్‌ కమర్షియల్‌ హీరోలా కనిపించాడు. డ్యాన్స్‌, డైలాగ్‌ డెలివరీ.. ఇలా అన్ని అంశాలు బాగున్నాయి. సుమకు ఈ సినిమా ఎంత ప్రత్యేకమో.. నాకూ అంతే. ఎందుకంటే మా సోదరుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు’’ అని సిద్ధు తెలిపాడు. ‘‘ఈ వేదికపై ఉన్న చాలామందితో నా ప్రయాణం మొదలైంది. ఈ సినిమా టీమ్‌ నా కుటుంబంలాంటిది’’ అని శేష్‌ పేర్కొన్నారు. ‘‘రవికాంత్‌ పేరేపు సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇది ఆయనకు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. శేష్, సిద్ధు, విశ్వక్‌.. కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రోషన్‌, మానస అలానే ఎదగాలని ఆశిస్తున్నా’’ అని నందిని రెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని