Keerthy Suresh: ‘చిన్ని’.. ప్రతీకార కథ

‘‘ప్రతీకారం తీర్చుకోవడమంటే ఏంటి?’’ అని ఆవేదన.. ఆగ్రహం నిండిన స్వరంతో ప్రశ్నిస్తోంది కీర్తి సురేష్‌. మరి ఆమె ఈ మాటలు అనడానికి కారణమేంటి? తను ప్రతీకారం తీర్చుకోవాలనుకునేది ఎవరిపై? అన్నవి తెలియాలంటే తమిళ చిత్రం ‘సాని కాయిదం’

Updated : 23 Apr 2022 07:10 IST

‘‘ప్రతీకారం తీర్చుకోవడమంటే ఏంటి?’’ అని ఆవేదన.. ఆగ్రహం నిండిన స్వరంతో ప్రశ్నిస్తోంది కీర్తి సురేష్‌. మరి ఆమె ఈ మాటలు అనడానికి కారణమేంటి? తను ప్రతీకారం తీర్చుకోవాలనుకునేది ఎవరిపై? అన్నవి తెలియాలంటే తమిళ చిత్రం ‘సాని కాయిదం’ చూడాల్సిందే. కీర్తి సురేష్‌, సెల్వ రాఘవన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. అరుణ్‌ మతేశ్వరన్‌ తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో ‘చిన్ని’గా విడుదల కానుంది. దీని టీజర్‌ను హీరో ధనుష్‌ శుక్రవారం విడుదల చేశారు. ఇదొక విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందింది. ‘‘ప్రతీకారం తీర్చుకోవడమంటే ఏంటి? ఎవరైనా మన మీద రాయి విసిరితే.. మనమూ తిరిగి విసరాలి’’ అంటూ కీర్తి సురేష్‌ వాయిస్‌ ఓవర్‌తో సాగిన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఈ సినిమా మే 6న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని