చిరు సరికొత్త అవతారం!
కరోనా వైరస్, లాక్‌డౌన్‌తో వచ్చిన ఖాళీ సమయాన్ని అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే అనే వ్యాపకాలతో గడుపుతున్న ఆయన
హైదరాబాద్: కరోనా వైరస్, లాక్‌డౌన్‌తో వచ్చిన ఖాళీ సమయాన్ని అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే అనేక వ్యాపకాలతో గడుపుతున్న ఆయన అభిమానులను షాక్‌కు గురి చేశారు. గురువారం ఇన్‌స్టా వేదికగా ఆయన పంచుకున్న ఫొటో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అభిమానులే కాదు, ఆయన తనయుడు రామ్‌చరణ్ సైతం ‘నాన్న నేను చూస్తున్నది నిజమేనా’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో అభిమానులను ఖుషీ చేస్తున్న చిరు ఇదిగో ఈ ఫొటోలో ఉన్న మాదిరిగా మారిపోవడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గుండు చేయించుకుని, నల్లటి కద్దాలతో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ‘నేను సాధువులా ఉన్నానా’ అంటూ అర్బన్‌మాంక్ హ్యాష్ ట్యాగ్ జోడించారు. ఈ ఫొటో పెట్టిన కొద్దిసేపటికే అభిమానుల నుంచి లైక్‌లు, కామెంట్ల వరద ప్రవాహం మొదలైంది. అయితే, చిరు నిజంగా గుండు చేయించుకున్నారా? లేక ఏదైనా యాప్ మహిమా? ఫొటో షాపా? అన్నది తెలియరాలేదు. ఏదేమైనా ఇప్పటివరకూ చిరును అభిమానులు ఇలా చూడలేదు.
చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని తర్వాత ‘లూసిఫర్’, ‘వేదాళం’ రీమేక్‌లలో నటించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K Viswanath: విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!
-
General News
Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ
-
India News
Parliament: అదానీ ఎఫెక్ట్.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు
-
World News
Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!
-
General News
TTD: తిరుమలలో ఆటోమేటిక్ యంత్రాలతో లడ్డూ తయారీ!
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు