Dhee13 promo: ఇంట్రెస్టింగ్... ఈ వారం ఇద్దరు ‘కింగ్స్’ ఎలిమినేట్!
‘అదుర్స్’లోని ‘చంద్రకళ’ పాటకి శ్రవణ్ అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.
హైదరాబాద్: ‘అదుర్స్’లోని ‘చంద్రకళ’ పాటకి శ్రవణ్ అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. ‘ఎన్టీఆర్‌కి ఏమాత్రం తగ్గలేదు’ అని గణేశ్ మాస్టర్ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ‘వాన వాన వల్లప్ప’ పాటకు అందమైన స్టెప్పులతో పల్లెటూరి పడుచులాగా క్వీన్స్ కంటెస్టెంట్ చేసిన డ్యాన్స్‌కి పూర్ణ, ప్రియమణి ఫిదా అయ్యారు. ఆమె పలికించిన హావభావాలు నచ్చి ‘వన్ ఉమెన్ షో’ అని ప్రియమణి కితాబిచ్చింది. ప్రియమణి, గణేశ్ మాస్టర్, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ షో ‘ఢీ-13’. ‘కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ కాన్సెప్ట్‌తో ప్రసారమవుతోన్న ఈ షోకి ప్రదీప్ వ్యాఖ్యాత. కింగ్స్ టీమ్ మెంటార్స్‌గా సుధీర్-ఆది, క్వీన్స్ టీమ్ మెంటర్స్గా రష్మి-దీపికా వ్యవహరిస్తున్నారు. వచ్చే బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
ఇందులో ఇరు జట్లకు చెందిన కంటెస్టెంట్స్ తమ డ్యాన్స్‌తో న్యాయనిర్ణేతల్ని ఫిదా చేశారు. ఇక సుధీర్, రష్మిల ప్రేమాయణంతో పాటు హైపర్ ఆది, దీపికలు చేసిన సందడి నవ్వులు పూయిస్తోంది. వీరికి ఫైమా పంచులు కూడా తోడై ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఈ వారం కింగ్స్ టీమ్‌లో రెండు ఎలిమినేషన్లుంటాయని ప్రియమణి చెప్పడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఇంతకీ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? సుధీర్, రష్మిల ప్రేమకథ ఏమైంది? ఫైమా చేసిన సందడేంటి? లాంటి ఎన్నో ఆసక్తికర విశేషాలు చూడాలంటే అక్టోబర్ 8 దాకా ఆగాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.