Ustaad Bhagat Singh: గ్లాసంటే సైజు కాదు.. సైన్యం!

‘‘కచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాసంటే సైజు కాదు.. సైన్యం. కనిపించని సైన్యం’’ అంటూ తన ప్రత్యర్థుల్ని హెచ్చరిస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడాయన కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.

Updated : 20 Mar 2024 10:36 IST

‘‘కచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాసంటే సైజు కాదు.. సైన్యం. కనిపించని సైన్యం’’ అంటూ తన ప్రత్యర్థుల్ని హెచ్చరిస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడాయన కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా నుంచి మంగళవారం ‘భగత్స్‌ బ్లేజ్‌’ పేరుతో ఓ వీడియో గ్లింప్స్‌ను బయటకొదిలారు. నిమిషం నిడివితో ఉన్న ఈ ప్రచార చిత్రంలో పవన్‌ ఆద్యంతం యాక్షన్‌ మోడ్‌లోనే కనిపించారు. వందలాది మంది జనం మధ్య నుంచి కారులో ఆయన ఎంట్రీ ఇచ్చిన తీరు.. జాతర మధ్యలో శత్రుమూకను చీల్చి చెండాడిన విధానం.. ప్రతిదీ ఆయన అభిమానులకు కనులవిందుగా ఉన్నాయి. ఈ టీజర్‌లో పవన్‌ను ఉద్దేశిస్తూ ఓ రౌడీ.. ‘‘నీ రేంజ్‌ ఇది’’ అంటూ తన చేతిలో ఉన్న గాజు గ్లాస్‌ను కింద పడేసి పగలగొట్టగా.. ‘‘గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది’’ అంటూ ఆ గాజు ముక్కతో పవన్‌ ఆ రౌడీని ఊచకోత కోసిన తీరు.. ‘‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు.. సైన్యం’’ అంటూ ఆఖర్లో పేల్చిన కౌంటర్‌ హైలెట్‌గా నిలిచాయి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా.. అయనంక బోస్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని