Dil Raju: ఆ విషయంలో ఏది నమ్మాలో నాకు తెలియలేదు: దిల్‌రాజు

‘రౌడీబాయ్స్‌’ తర్వాత హీరో ఆశిష్‌ నటిస్తోన్న చిత్రం ‘సెల్ఫిష్‌’. ఈ సినిమా తొలి పాట విడుదల వేడుకకు దిల్‌రాజు హాజరై, మాట్లాడారు.

Published : 01 May 2023 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కుటుంబ సభ్యుడు ఆశిష్‌ (Ashish) హీరోగా నటించిన తొలి చిత్రం ‘రౌడీబాయ్స్‌’ (Rowdy Boys)పై వచ్చిన స్పందనల్లో ఏది నమ్మాలో తెలియలేదని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) అన్నారు. కొందరు ఆ సినిమా బాగుందన్నారని, ఇంకొందరు.. తమ అబ్బాయి కాబట్టి బాగా ప్రచారం చేసి సినిమాని ఆడించారనే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. రెవెన్యూ వచ్చినప్పుడే ఏ చిత్రమైనా విజయం సాధించినట్టు అని పేర్కొన్న ఆయన ‘రౌడీబాయ్స్‌’.. కొత్త హీరో స్థాయికి తగ్గట్టు వసూళ్లు రాబట్టిందని తెలిపారు. ఆశిష్ కొత్తవాడిలా కాకుండా అనుభవం ఉన్న నటుడిలా చేశాడని ప్రేక్షకులు ప్రశంసించారన్నారు. ఆశిష్‌ నటిస్తోన్న రెండో సినిమా ‘సెల్ఫిష్‌’ (Selfish)లోని ‘దిల్‌ ఖుష్‌’ (Dil Kush) పాట విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు.

‘‘ఆశిష్‌ తొలి ప్రయత్నంలోనే నటుడిగా గుర్తింపు పొందాడు కాబట్టి తదుపరి చిత్రం ఇంకా బాగుండాలని అనుకున్నా. సెల్ఫిష్‌ కథ వినగానే నచ్చింది. దాంతో.. నేనూ దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాలో భాగస్వాములమయ్యాం. నేనూ సుకుమార్‌ కలిసి సుమారు 19 ఏళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నాం. ఈ ‘దిల్‌ ఖుష్‌’ పాటకు మిక్కీ జె. మేయర్‌ స్వరాలు సమాకూర్చాడు. మరో రెండు పాటలు అనూప్‌ రూబెన్స్‌ అందించాడు. ఇతర పాటలకు మరో సంగీత దర్శకుడిని తీసుకుని.. మ్యూజిక్‌ విషయంలో బాలీవుడ్‌ కల్చర్‌ని పరిచయం చేయబోతున్నాం’’ అని దిల్‌రాజ్‌ వివరించారు.

ధూల్‌పేట నేపథ్యంలో సాగే ప్రేమకథతో దర్శకుడు కాశీ విశాల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘లవ్‌టుడే’ ఫేం ఇవానా (Ivana) కథానాయిక. సుకుమార్‌ రైటింగ్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆశిష్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సాంగ్‌ లాంఛ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు