కంగన..నీవుండగా దేశాన్ని టచ్‌ చేయలేరు

సోషల్‌మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను బహిర్గతం చేసి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు బాలీవుడ్ నటి కంగన రనౌత్‌. మహారాష్ట్ర ప్రభుత్వం, బీటౌన్‌పై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సైతం కంగనపై ఫైర్‌ అవుతున్నారు...

Updated : 23 Feb 2024 18:54 IST

నటిపై దర్శకుడి వ్యంగ్యాస్త్రాలు

ముంబయి: సోషల్‌మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు బాలీవుడ్ నటి కంగన రనౌత్‌. మహారాష్ట్ర ప్రభుత్వం, బీటౌన్‌పై ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సైతం కంగనపై ఫైర్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పెట్టిన ఓ ట్వీట్‌పై దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ వ్యంగ్యంగా స్పందించారు. ‘నేను ఒక పోరాట యోధురాలిని. కావాలనుకుంటే ప్రాణత్యాగం చేస్తాను. వేరొకరికి తలవంచను. దేశ గౌరవం కాపాడేందుకు తరచూ నా స్వరాన్ని వినిపిస్తుంటాను. మర్యాద, ఆత్మగౌరవంతో ఒక జాతీయవాదిగా జీవిస్తుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ విలువల విషయంలో రాజీపడను.. పడబోను. జైహింద్‌’ అని కంగన చేసిన ట్వీట్‌పై అనురాగ్‌ వ్యంగ్యంగా స్పందించారు.

‘కంగన.. మీరు ఒక మణికర్ణిక. నలుగురు లేదా ఐదుగుర్ని తీసుకువెళ్లి మనదేశంలోకి చొచ్చుకువస్తోన్న చైనాపై పోరాటం చేసిరండి. మీరు ఇక్కడ ఉన్నంత వరకూ దేశాన్ని ఎవరూ ఏం చేయలేరని వాళ్లకు తెలియజేయండి. మీ ఇంటి నుంచి కేవలం ఒక్కరోజు ప్రయాణం చేస్తే ఎల్‌ఏసీ వస్తుంది’ అంటూ కామెంట్‌ చేశారు. అయితే అనురాగ్‌ చేసిన కామెంట్‌ను కంగన తిప్పికొట్టారు. ‘దేశ సరిహద్దుల్లోకి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా ఒలింపిక్స్‌కి వెళ్లండి. ఎందుకంటే దేశం స్వర్ణ పతకాలు కోరుకుంటోంది. గుర్తుపెట్టుకోండి..! అది మీరు తెరకెక్కించే బీ గ్రేడ్‌ ఫిల్మ్‌ కాదు’ అని కంగన కౌంటర్‌ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని