Varun Tej: లక్ష్యం దిశగా చకచకా

‘గాండీవధారి అర్జున’ (Gandivdhari Arjuna)గా యాక్షన్‌ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు వరుణ్‌ తేజ్‌ (Varun Tej). ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 12 Feb 2023 07:02 IST

‘గాండీవధారి అర్జున’ (Gandivdhari Arjuna)గా యాక్షన్‌ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు వరుణ్‌ తేజ్‌ (Varun Tej). ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. పూర్తిగా లండన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. కొన్నాళ్లుగా ఈ సినిమా చిత్రీకరణ యూకేలోనే జరుగుతోంది. తాజాగా ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమాల వేదికగా సెట్లోని కొన్ని స్టిల్స్‌ను పంచుకున్నారు. అందులో వరుణ్‌ స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకునేలా కనిపించారు. త్వరలో యూరప్‌లో మరిన్ని క్లాసిఫైడ్‌ మిషన్‌లను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రంలో వరుణ్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని