RRR: నీ నిష్కలంక చరితం... నా సుప్రభాతమవని..

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులు. అజయ్‌దేవగణ్‌, శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరీస్‌ నాయికలు.

Updated : 27 Nov 2021 07:46 IST

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులు. అజయ్‌దేవగణ్‌, శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరీస్‌ నాయికలు. ఈ చిత్రం జనవరి 7న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘జనని..’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘థీమ్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో విడుదలైన ఈ పాట తీవ్రమైన భావోద్వేగాలతో నిండిపోయింది. ఇందులోని ప్రతీ దృశ్యం ఆకట్టుకుంటోంది. ‘‘నేనంటే పోరాటం... అందులో సగం నువ్వు’’ అంటూ అజయ్‌దేవగణ్‌ వీరోచితంగా పలికే డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. ‘‘జనని.. ప్రియభారతి జనని.. నీ నిష్కలంక చరితం... నా  సుప్రభాతమవని... జనని’’ అంటూ సాగే సాహిత్యం ప్రేక్షకుల్లో దేశభక్తిని రేకేత్తించేలా ఉంది. ఈపాటకు ఎం.ఎం.కీరవాణి సంగీతంతో పాటు... సాహిత్యమూ అందించి ఆలపించారు. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని