Aditi Rao Hydari: ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్‌ హైదరీ

ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్‌ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు.

Published : 26 Apr 2024 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలోనే ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి అదితి రావ్‌ హైదరీ (Aditi Rao Hydari). మే 1 నుంచి ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో సిరీస్‌బృందం వరుస ప్రమోషన్లు ఇస్తూ బిజీగా ఉంది. తాజాగా అదితీ కూడా ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘ఈ సిరీస్‌లో నాది మృదుస్వభావం కలిగిన పాత్ర. వ్యక్తిగతంగా కూడా నేను అలానే ఉంటాను. చిన్నప్పటినుంచి ఇంట్లో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దేనికోసం పోరాడాల్సిన అవసరం రాలేదు. నా తల్లిదండ్రులు కూడా ప్రతీ విషయంలోనూ సపోర్ట్‌ చేశారు. ప్రేమపై చిన్ననప్పటినుంచి నమ్మకమేర్పడింది. విశ్వాసం ఉంటే దేన్నైనా సాధించగలం. మహిళలు చాలా విషయాల్లో సర్దుకుపోతుంటారు. నేను దేని గురించైనా ధైర్యంగా మాట్లాడతాను. ‘హీరామండీ’లో పాత్రలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. సంజయ్‌లీలా బన్సాలీ స్త్రీలను చూపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్లు ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రతీకారం తీర్చుకోగలరు. అన్ని కోణాల్లోనూ చూపించడం ఆయనకు మాత్రమే సాధ్యం’ అని చెప్పారు.

ఈ సిరీస్‌లో అదితిరావ్‌ బిబ్బోజాన్‌ పాత్రలో నటించారు. వేశ్య వృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న కొంతమంది మహిళల జీవిత కథే ఈ సిరీస్‌. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినీప్రియుల దృష్టిని ఆకర్షించాయి. పలు వాయిదాల తర్వాత మే1 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని