Vidya Balan: మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్‌

మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్‌.. ది కోర్‌’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్‌ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు.

Published : 26 Apr 2024 14:36 IST

ముంబయి: మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్‌.. ది కోర్‌’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్‌ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. ‘‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా మలయాళీ చిత్రాలు చూస్తున్నా. మోహన్‌లాల్‌ సినిమాలంటే నాకెంతో ఇష్టం. ఆయన చిత్రాల్లో కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. ఇటీవల నేను మమ్ముట్టి యాక్ట్‌ చేసిన ‘కాదల్‌ ది కోర్‌’ చూశా. ఆయన అద్భుతంగా నటించారు. సినిమా చూసిన తర్వాత దుల్కర్‌ సల్మాన్‌కు మెసేజ్‌ పంపించా. ఆ సినిమా నాకెంతో నచ్చిందని చెప్పా. నా సందేశాన్ని మమ్ముట్టికి చేరవేయమన్నా. బాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ ఇలాంటి చిత్రంలో యాక్ట్‌ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరు’’ అని అన్నారు.

అనంతరం ఆమె ‘డర్టీ పిక్చర్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘స్మోకింగ్ ఎలా చేయాలో నాకు తెలుసు. కానీ ఎప్పుడూ దాని జోలికి వెళ్లలేదు. ‘డర్టీ పిక్చర్‌’ తర్వాత స్మోకింగ్‌ అలవాటుగా మారింది. కొన్ని రోజులపాటు దానిని కొనసాగించా. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అర్థమైంది. దాంతో దానిని దూరం పెట్టా’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని