Samantha: ‘సిటాడెల్‌’ సన్నాహాల్లో..

సమంత కెరీర్‌ జోరుగా సాగుతోంది. ఓ పక్క సినిమాలు..మరో పక్క వెబ్‌ సిరీస్‌లతో తీరిక లేకుండా గడుపుతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న ఈ భామ తాజాగా ‘సిటాడెల్‌ ఇండియా’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 08 Oct 2022 07:01 IST

మంత (Samantha) కెరీర్‌ జోరుగా సాగుతోంది. ఓ పక్క సినిమాలు..మరో పక్క వెబ్‌ సిరీస్‌లతో తీరిక లేకుండా గడుపుతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న ఈ భామ తాజాగా ‘సిటాడెల్‌ ఇండియా’ (Citadel India) వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని పాత్ర కోసం సమంత ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. హిందీ భాషలోని యాస కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సిరీస్‌ 1990ల నేపథ్యంలో సాగుతోందని తెలుస్తోంది. ఈ సిరీస్‌ చిత్రీకరణ కోసం చిత్రబృందం ప్రత్యేక నవంబరు తొలివారంలో వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు చివర్లో కానీ డిసెంబరు తొలివారంలో కానీ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందనుంది. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మేడెన్‌ నటిస్తున్నారు. వరుణ్‌ధావన్‌ కీలక పాత్రలో నటిస్తున్న ‘సిటాడెల్‌ ఇండియా’కు రాజ్‌, డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని