‘రావణాసుర’.. ట్రైలర్‌ ఆరోజే

‘రావణాసుర’గా ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమయ్యారు రవితేజ. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని సుధీర్‌వర్మ తెరకెక్కించారు.

Published : 26 Mar 2023 02:18 IST

‘రావణాసుర’గా ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమయ్యారు రవితేజ. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని సుధీర్‌వర్మ తెరకెక్కించారు. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. హీరో సుశాంత్‌ ఓ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 28న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. అందులో రవితేజ తుపాకీ పట్టుకొని చేతులు పైకెత్తి సీరియస్‌ లుక్‌లో కనిపించగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో కోర్టు గది తగలబడే సన్నివేశం ఆసక్తి రేకెత్తిస్తోంది. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని