ప్రభాస్‌ జోరు

ప్రభాస్‌ - మారుతి కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా.. ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది.

Published : 01 Apr 2023 01:46 IST

ప్రభాస్‌ - మారుతి కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా.. ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈనెల రెండో వారం నుంచి హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్‌ మొదలు కానుందని సమాచారం. దాదాపు పదిరోజులకు పైగా సాగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. వినోదాత్మకంగా సాగే హారర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇందులో నిధి అగర్వాల్‌, మాళవిక మోహన్‌, రిద్ది కుమార్‌ నాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం.

జేమ్స్‌ బాండ్‌ లోకేషన్లలో ‘సలార్‌’

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తోన్న చిత్రం ‘సలార్‌’. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఇటలీలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జేమ్స్‌ బాండ్‌ చిత్రం ‘నో టైమ్‌ టు డై’ షూటింగ్‌ జరిగిన ప్రదేశాల్లో సలార్‌ చిత్రీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు