యమధీర రాజకీయం

కన్నడ తార కోమల్‌ కుమార్‌ కథానాయకుడిగా... శంకర్‌.ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అనువాద చిత్రం ‘యమధీర’. రిషిక శర్మ కథానాయిక. క్రికెటర్‌ శ్రీశాంత్‌ ముఖ్యభూమిక పోషించారు.

Published : 19 Mar 2024 00:50 IST

న్నడ తార కోమల్‌ కుమార్‌ కథానాయకుడిగా... శంకర్‌.ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అనువాద చిత్రం ‘యమధీర’. రిషిక శర్మ కథానాయిక. క్రికెటర్‌ శ్రీశాంత్‌ ముఖ్యభూమిక పోషించారు. నాగబాబు, అలీ, సత్యప్రకాశ్‌, మధుసూదన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని నిర్మాత వేదాల శ్రీనివాస్‌ ఈ నెల 23న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, కోశాధికారి రామసత్యనారాయణ, నిర్మాతలు డి.ఎస్‌.రావు, పి.శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రైలర్‌ విడుదల అనంతరం టి.ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘ఇది తెలుగు సినిమాలాగే అనిపిస్తోంది. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.ఈ చిత్రం ఈవీఎంల ట్యాంపరింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిందన్నారు నిర్మాత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని