Dwarakish: కన్నడ నటుడు ద్వారకీష్‌ కన్నుమూత

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకనిర్మాత ద్వారకీష్‌(81) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మంగళవారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated : 17 Apr 2024 12:14 IST

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకనిర్మాత ద్వారకీష్‌(81) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మంగళవారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. హాస్యభరితమైన నటనతో ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసుకున్న ఈయన 90పైగా సినిమాల్లో నటించారు. దాదాపు 50 చిత్రాలకు దర్శకనిర్మాతగా పనిచేశారు. ‘పరమానందయ్య శిష్యుల కథ’, ‘రామాయణంలో పిడకల వేట’, ‘ఎవరికివారే యమునాతీరే!’ లాంటి తెలుగు చిత్రాలను కన్నడలో రీమేక్‌ చేసి మంచి విజయాన్ని అందుకున్నారీయన. ప్రముఖ హిందీ నేపథ్య గాయకుడు కిశోర్‌ కుమార్‌ను కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. కన్నడ చిత్రసీమకు ఆయన చేసిన సేవలకు గానూ ఎన్టీఆర్‌ అవార్డు అందుకున్నారు ద్వారకీష్‌. హాస్యనటుడిగా, హీరోగా, సహాయ నటుడిగా పాత్రలకు జీవం పోశారని, కన్నడ చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరవలేనివని పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ద్వారకీష్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని