Priyanka chopra: ఇలాంటి కలయికలో మరో చిత్రం రాదేమో!

గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.

Updated : 09 May 2024 10:09 IST

గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇంగ్లిష్‌ చిత్రం ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇలియా నైషుల్లర్‌ దర్శకత్వంలో రానున్న యాక్షన్‌ కామెడీ చిత్రమిది. పీటర్‌ సాఫ్రన్‌, జాన్‌ రికర్డ్‌ నిర్మాతలు. జాన్‌ సెనా కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ముగిసిన నేపథ్యంలో ప్రియాంక సామాజిక మాధ్యమాల వేదికగా వీడియోని పంచుకుంది. ‘ఏడాది పాటు చిత్రీకరణ జరిపాం. వినోదం నిండిన సెట్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేసినందుకు గౌరవంగా ఉంది. ఇలాంటి ఓ గొప్ప కలయికలో మరో చిత్రం రాదేమో. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. మేము పంచుకున్న ఆ ఆనందాన్ని మీ అందరూ చూడాలని ఆశిస్తున్నాను’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. సముద్రపు దొంగ కథనంతో రూపొందుతున్న ‘ది బ్లఫ్‌’ అనే చిత్రంలోనూ ప్రియాంక కీలక పాత్రలో మెరవనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు