Vijay devarakonda: కొత్త కథలతో ప్రయాణం
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆయన సినీ ప్రయాణం గురించి పొరుగు భాషలు సైతం ఆసక్తిని వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో మరిన్ని కొత్త నేపథ్యాల్ని, కొత్త రకమైన పాత్రల్ని స్పృశిస్తూ సినిమాలు చేయడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో... స్పై థ్రిల్లర్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతోంది. గురువారం తన పుట్టినరోజుని ఈ సినిమా సెట్లోనే జరుపుకోనున్నారు విజయ్. ఈ సినిమా తర్వాత ఆయన చేయనున్న రెండు సినిమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. రవికిరణ్ కోలా దర్శకత్వంలో... గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ డ్రామా కథలో నటించనున్నారు విజయ్. దిల్‌రాజు నిర్మాత. దీంతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో... రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా ఓ సినిమా చేయనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. ఓ స్పై థ్రిల్లర్, ఓ పీరియాడిక్ కథ, గ్రామీణ నేపథ్యంలో సాగే మరో చిత్రం... ఇలా విభిన్నమైన కథలతో సరికొత్త ప్రయాణం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు విజయ్ దేవరకొండ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్‌హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..