Kamal haasan: కమల్‌ చిత్రంలో గౌతమ్‌ కార్తీక్‌?

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా మణిరత్నం తెరకెక్కించనున్న పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’.

Updated : 04 Dec 2023 09:33 IST

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా మణిరత్నం తెరకెక్కించనున్న పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో త్రిష కథానాయికగా కనిపించనుండగా.. దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ జాబితాలోకి తమిళ యువ హీరో గౌతమ్‌ కార్తీక్‌ కూడా చేరినట్లు సమాచారం. ఆయన ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నారని తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. సినిమా చేసేందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు వార్తలొస్తున్నాయి. మణిరత్నం తెరకెక్కించిన ‘కడలి’తో హీరోగా తెరకు పరిచయమయ్యారు కార్తీక్‌. ‘థగ్‌ లైఫ్‌’ భిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. కమల్‌ ఇందులో రంగరాయ శక్తివేల్‌ నాయకర్‌ అనే బందిపోటుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని