Naveen Polishety: రాజు గాడి పెళ్లి.. ఈ దశాబ్దానికే ప్రత్యేకం

‘‘రాజు గాడి పెళ్లి ఇది.. ఏడు తరాల పెళ్లి.. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’’ అంటూ హంగామా చేస్తున్నాడు నవీన్‌ పొలిశెట్టి. మరి ఆ పెళ్లి వేడుక ఎలా జరిగింది.. ఆ వేడుకలో నవ్వులు ఏస్థాయిలో పండాయి? తెలియాలంటే ‘అనగనగా ఒక రాజు’’ చూడాల్సిందే. ‘జాతిరత్నాలు’ విజయం తర్వాత నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్న చిత్రమిది.

Updated : 17 Jan 2022 06:35 IST

‘‘రాజు గాడి పెళ్లి ఇది.. ఏడు తరాల పెళ్లి.. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’’ అంటూ హంగామా చేస్తున్నాడు నవీన్‌ పొలిశెట్టి. మరి ఆ పెళ్లి వేడుక ఎలా జరిగింది.. ఆ వేడుకలో నవ్వులు ఏస్థాయిలో పండాయి? తెలియాలంటే ‘అనగనగా ఒక రాజు’’ చూడాల్సిందే. ‘జాతిరత్నాలు’ విజయం తర్వాత నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్న చిత్రమిది. కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆదివారం ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఓ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘ఇదేం విడ్డూరం ఆడవాళ్లకేనా వడ్డాణం.. అందుకే నేను కూడా మామకు చెప్పి డబ్ల్యుడబ్ల్యుయఫ్‌ లాంటిది ఓ ఐదు కిలోల బంగారం చేయించాను’’, ‘‘మన పెళ్లి ఫొటోలు చూసి ఆ కత్రినా కైఫ్‌, విక్కీ కౌషల్‌ కుళ్లుకుని చావాలరా.. అలా తియ్యి నువ్వు’’ అంటూ వీడియోలో నవీన్‌ చేసిన హంగామా ఆసక్తికరంగా అనిపించింది. ‘‘రాజు గాడి పెళ్లి ఇది. నేను చెప్పుకోకూడదు కానీ, ఈ దశాబ్దంలోనే మోస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేడుక ఇదే. థియేటర్లలో మీరే చూస్తారుగా’’ అంటూ టీజర్‌ ఆఖర్లో నవీన్‌ చెప్పిన డైలాగ్‌ సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని