
Hey Jude: నివిన్ పౌలి, త్రిష నటించిన‘హే జూడ్’ ట్రైలర్ చూశారా?
హైదరాబాద్: సత్పవర్తన కలిగిన యువకుడిగా.. అమ్మాయి మనసు దోచే అమాయకపు వ్యక్తిగా... ‘హే జూడ్’ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు మలయాళీ నటుడు నివిన్ పౌలి. ‘ప్రేమమ్’, ‘బెంగళూర్ డేస్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు నివిన్ సుపరిచితుడే. తెలుగు, తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిషకి ఇదే తొలి మలయాళీ చిత్రం. శుక్రవారం ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. రొమాంటిక్- కామెడీ జానర్‌లో దర్శకుడు శ్యామ్ ప్రసాద్ తెరకెక్కించారు. 2018 ఫిబ్రవరి 2న మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు గోపీ సుందర్, రాహుల్ రాజ్, ఊసేప్పచాన్, ఎం. జయచంద్రన్ పనిచేయడం విశేషం. మరి అమాయకపు జూడ్ నివిన్, యాక్టివ్ అమ్మాయిగా కనిపించిన త్రిషతో కలిసి ఎలా అలరించారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!