Ek mini katha: శోభ‌న్ బాధ చూశారా!

యువ న‌టుడు సంతోష్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో తెర‌కెక్కుతోన్న  చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్ నాయిక‌.

Updated : 07 Dec 2022 21:59 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: యువ న‌టుడు సంతోష్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో తెర‌కెక్కుతోన్న  చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్ నాయిక‌. ఈ చిత్రం మే 27 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘ఐ హేట్ మై లైఫ్’ అనే ఫుల్ వీడియో సాంగ్‌ని విడుద‌ల చేసింది చిత్రబృందం. ఇందులో క‌థానాయ‌కుడి బాధ‌ని చూపించారు. శోభ‌న్ డ్యాన్సు, సాహిత్యానికి త‌గినట్టు ప‌లికించిన హావ‌భావాలు ఆక‌ట్టుకుంటున్నాయి. అత‌ను ఎదుర్కొంటున్న స‌మ‌స్యని ర‌చ‌యిత భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్ క్యాచీ ప‌దాల‌తో తెలియ‌జేసిన తీరు మెప్పిస్తోంది. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించ‌గా, హేమ‌చంద్ర ఆల‌పించారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల‌ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. ఇందులో బ్రహ్మాజీ, హర్షవర్ధన్‌, సుదర్శన్‌, పోసాని, శ్రద్ధా దాస్‌, సప్తగిరి తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని