Dhanush: మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజా

సంగీత ప్రపంచంలో ఓ అద్భుత ప్రయాణం ఇళయరాజాది. అలాంటి గొప్ప సంగీత దర్శకుడి జీవిత కథ వెండితెరకు రానున్న సంగతి తెలిసిందే. ధనుష్‌ ప్రధాన పాత్రలో అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 21 Mar 2024 10:53 IST

సంగీత ప్రపంచంలో ఓ అద్భుత ప్రయాణం ఇళయరాజాది. అలాంటి గొప్ప సంగీత దర్శకుడి జీవిత కథ వెండితెరకు రానున్న సంగతి తెలిసిందే. ధనుష్‌ ప్రధాన పాత్రలో అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ఈ సినిమా టైటిల్‌ను ‘ఇళయరాజా’గా ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. చెన్నై వీధుల్లో హార్మోనియం పట్టుకొని నిల్చొని ఉన్న ఆ పోస్టర్‌ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. ది కింగ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌.. అని పోస్టర్‌పై ఉన్న వ్యాఖ్య ఇళయరాజాకు తగ్గ పేరని అంటున్నాయి సినీ వర్గాలు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుందీ చిత్రం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని