Indian 2: భారతీయుడు 2.. ముగించారు

కథానాయకుడు కమల్‌హాసన్‌.. దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్ల కాంబినేషన్‌లోనే వచ్చిన హిట్‌ సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కుతోంది.

Updated : 03 Jan 2024 11:53 IST

థానాయకుడు కమల్‌హాసన్‌.. దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్ల కాంబినేషన్‌లోనే వచ్చిన హిట్‌ సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కుతోంది. దీన్ని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర సన్నిహిత వర్గాలు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముందని ప్రచారం వినిపిస్తోంది. ఇందులో సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతమందిస్తుండగా.. రవి వర్మన్‌ ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ‘భారతీయుడు 2’ చిత్రీకరణ పూర్తి కావడంతో శంకర్‌ ఇక పూర్తిగా ‘గేమ్‌ ఛేంజర్‌’పై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే 80శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలలోనే కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని