Rana: షారుక్‌ చిత్రంలో రానా?

షారుక్‌ ఖాన్‌, రానా దగ్గుబాటి కలిసి నటించనున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ సినీ వర్గాలు.

Updated : 25 Jun 2022 08:25 IST

షారుక్‌ ఖాన్‌(Sharukh Khan), రానా దగ్గుబాటి (Rana) కలిసి నటించనున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ (Bollywood) సినీ వర్గాలు. షారుఖ్‌ - అట్లీ (Atlee) కాంబినేషన్‌లో ‘జవాన్‌’(jawan) అనే పాన్‌ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం పేరున్న దక్షిణాది స్టార్‌ను తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది చిత్ర బృందం. ఇప్పుడా పాత్ర కోసం రానాను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఈ చిత్ర విషయంలో రానా సానుకూలంగా ఉన్నారని ప్రచారం వినిపిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందులో షారుఖ్‌కు జోడీగా నయనతార(Nayanthara) కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని