super machi: ఓటీటీలో చిరంజీవి అల్లుడు చిత్రం?
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిమైంది. రియా చక్రవర్తి, రుచితా రామ్ కథానాయికలుగా నటించారు. రొమాంటిక్ కామెడీ రూపొందిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా విడుదలకు నోచుకోలేకపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకుడు చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిమైంది. రియా చక్రవర్తి, రుచితా రామ్ కథానాయికలుగా నటించారు. రొమాంటిక్ కామెడీ రూపొందిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా విడుదలకు నోచుకోలేకపోయింది. తాజాగా సినిమాని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. కానీ త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
అంతా సవ్యంగా ఉంటే ఈ ఏడాది మార్చిలోనే థియేటర్లో విడుదల కావాల్సింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ఫస్టులుక్ టీజర్, లిరికల్ సాంగ్స్ విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇందులో రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ప్రగతి తదితరులు నటించారు. తమన్ సంగీత స్వరాలు అందించగా శ్యామ్ కె.నాయుడు కెమెరామెన్‌గా పనిచేశారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్