Indian 2: భారతీయుడి స్టైల్‌

అగ్ర దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ఎక్కువ సినిమాల్లో దేశభక్తి కీలకాంశం. అటు పాలకులకీ... ఇటు పౌరులకీ వాళ్ల వాళ్ల బాధ్యతల్ని గుర్తు చేసేలా ఉంటాయి ఆయా సినిమాలు. అవినీతిపై సమరశంఖాన్ని పూరిస్తాయి ఆ కథలు.

Updated : 16 Aug 2023 13:58 IST

గ్ర దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ఎక్కువ సినిమాల్లో దేశభక్తి కీలకాంశం. అటు పాలకులకీ... ఇటు పౌరులకీ వాళ్ల వాళ్ల బాధ్యతల్ని గుర్తు చేసేలా ఉంటాయి ఆయా సినిమాలు. అవినీతిపై సమరశంఖాన్ని పూరిస్తాయి ఆ కథలు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘ఇండియన్‌ 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాల్లోనూ అవే అంశాలు కీలకమని తెలుస్తోంది. అందుకేనేమో ఆగస్టు 15 సందర్భంగా ఈ రెండు సినిమాలకి సంబంధించిన చిత్రాల్ని  సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు శంకర్‌. కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటించిన ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమే ‘ఇండియన్‌2’. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఇందులో రామ్‌చరణ్‌ ఒక యువ ఐఏఎస్‌ అధికారిగానూ, యువ నాయకుడిగానూ రెండు కోణాల్లో  కనిపించనున్నట్టు సమాచారం. శంకర్‌ పంచుకున్న చిత్రాల్లో ఒకటి ‘ఇండియన్‌ 2’లోని కమల్‌హాసన్‌ది కాగా, మరొక చిత్రంలో తానే ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్లో స్క్రిప్ట్‌ చదువుతూ కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని