Fahadh Faasil: ఫహాద్‌.. ‘ధూమం’

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలోనే ప్రభాస్‌ ‘సలార్‌’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

Updated : 01 Oct 2022 14:01 IST

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలోనే ప్రభాస్‌ ‘సలార్‌’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సంస్థ ‘ధూమం’ (Dhoomam) అనే మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఇందులో ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) హీరోగా నటించనున్నారు. ‘యూ టర్న్‌’ ఫేమ్‌ పవన్‌ కుమార్‌ తెరకెక్కించనున్నారు. అపర్ణ బాలమురళి కథానాయిక. ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. వినూత్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం.. ఈనెల 9న సెట్స్‌పైకి వెళ్లనుంది. దీన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని