వాళ్లందరూ సిగ్గు తెచ్చుకోవాలి: సురేఖ
బుల్లితెర నటిగా కెరీర్ ఆరంభించి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి సురేఖా వాణి. తన నటన, కామెడీ టైమింగ్‌తో తెలుగువారికి చేరువైన సురేఖ తాజాగా తన స్నేహితురాలు, నటి రజితతో కలిసి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు.....
భావోద్వేగానికి లోనైన నటి
హైదరాబాద్: బుల్లితెర నటిగా కెరీర్ ఆరంభించి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి సురేఖా వాణి. తన నటన, కామెడీ టైమింగ్‌తో తెలుగువారికి చేరువైన సురేఖ తాజాగా తన స్నేహితురాలు, నటి రజితతో కలిసి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో తన జీవితానికి సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలను ఆమె బయటపెట్టారు. అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సురేశ్ మృతి గురించి ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘కొన్ని అపార్థాలు, మనస్పర్థల కారణంగా మా అత్తింటి కుటుంబం మాకు దూరంగా ఉంటోంది. క్లిష్ట పరిస్థితుల్లో సైతం వాళ్లు మాకు ఒక్కరూపాయి కూడా సాయం చేయలేదు. నేను, నా కూతురే అన్ని సమకూర్చుకున్నాం. అయినప్పటికీ నన్ను, నా కూతుర్ని వాళ్లు ఎంతో నిందించారు. నా భర్త మృతి విషయంలో నాదే తప్పన్నట్లు చెప్పారు. ఈ ప్రోగ్రామ్ చూశాకైనా.. నన్ను, నా కూతుర్ని అన్నందుకు వాళ్లు సిగ్గుతెచ్చుకోవాలి ’’ అని సురేఖ ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం తన భర్త మృతి గురించి మాట్లాడుతూ.. శరీరంలో రక్తం గడ్డ కట్టడంతో ఓ సర్జరీ జరిగిన నెల రోజులకే ఆయన కన్నుమూశారని చెబుతూ సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు, ఓ వ్యక్తి కారణంగా రైలు ప్రయాణం చేయడానికి తాను ఇప్పటికీ ఎంతో భయపడుతున్నానని రజిత తెలిపారు. సురేఖ, రజిత చెప్పిన సరదాగా సంగతులు, విశేషాలు తెలుసుకోవాలంటే మే 10న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ ఎపిసోడ్ చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే?
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్‌లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్‌పై బైడెన్‌కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక