K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
అగ్రదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (K.Viswanath) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. (K.Viswanath passed away)
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్ (K.Viswanath) (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు(K.Viswanath passed away) వైద్యులు ధ్రువీకరించారు. 5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. (K.Viswanath is no more)
కె.విశ్వనాథ్ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేశారు. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి ఆణిముత్యాలను తెలుగు చిత్రసీమకు అందించారు. ఎందరో అగ్రకథానాయకుల చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించి... ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీ రంగంలో ఆయన కృషికి 2016లో చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాదిలో పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ఇక విశ్వనాథ్ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం సినిమా ప్రఖ్యాత ఆస్కార్ (59వ)చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా పసిఫిక్ చలన చిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలన చిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమా ప్రదర్శితమైంది. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది.
శంకరాభరణం విడుదలైన రోజే..
ఈ లెజెండరీ డైరెక్టర్ చేతుల్లోంచి జాలువారిన మరో ఆణిముత్యం ‘శంకరాభరణం’. ఆయన చిత్రాల్లో ఈ ‘శంకరాభరణం’చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగు చిత్రపరిశ్రమలో ఒక సంచలనం. సంగీతమే ప్రాధాన్యంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులు లేకున్నా అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రానంతరమే కె.విశ్వనాథ్ ‘‘కళాతపస్వి’గా పేరుపొందారు. అయితే ‘శంకరాభరణం’ విడుదలైన రోజే ఆయన శివైక్యం చెందడం బాధాకరం.
ఆస్కార్‌కి నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రం స్వాతిముత్యం..
మొదటి చిత్రంతోనే మంచి పేరుతెచ్చుకున్న కాశీనాథుని విశ్వనాథ్ ఆ తర్వాత వరుసగా చెల్లెలి కాపురం, ఓ సీత కథ, కాలం మారింది, నేరము శిక్ష, శారద, జీవనజ్యోతి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అప్పటివరకు ఓ మూసలో వెళుతున్న తెలుగు చిత్రాలకు విశ్వనాథ్ ఓ కొత్త దిశను చూపారు. సిరిసిరిమువ్వ చిత్రంతో విశ్వనాథ్ తెలుగు చిత్రపరిశ్రమకు తన విశ్వరూపం చూపారు. సంస్కృతిని చాటి చెప్పేందుకు సినిమాలే సరైన మాధ్యమమని విశ్వనాథ్ భావించేవారు. ఇక తెలుగు సినీ చరిత్రలో శంకరాభరణం ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఇక శుభసంకల్పం చిత్రంతో ఆయన తొలిసారి నటుడిగా మారారు. తెలుగు, తమిళ భాషల్లో 30 చిత్రాల వరకు నటించారు. కమల్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన స్వాతిముత్యం(1985) చిత్రానికి మహిళా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆస్కార్‌కి నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రంగా స్వాతిముత్యం ఘనతకెక్కింది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం
దర్శకదిగ్గజం కాశీనాథుని విశ్వనాథ్ మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని, పువ్వాడ,సత్యవతి రాథోడ్, నిరంజన్‌రెడ్డి, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రముఖ నటులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం ప్రకటించారు.
అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండితెర దృశ్యకావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. గతంలో కె.విశ్వనాథ్ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని, ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో విశ్వనాథ్ పెద్ద పీట వేశారని కేసీఆర్ కొనియాడారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
విశ్వనాథ్ మరణం తనను తీవ్ర విచారానికి గురిచేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ అని, ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయన్నారు. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని సీఎం జగన్ కొనియాడారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Naatu Naatu Song: ‘నాటు నాటు’ కేవలం ఫాస్ట్ బీట్ మాత్రమే.. అవార్డు వస్తుందనుకోలేదు: కీరవాణి
-
India News
Khushbu Sundar: రాహుల్‌కు జైలుశిక్ష.. వైరల్ అవుతున్న ఖుష్బూ పాత ట్వీట్
-
General News
Hyderabad: సిగ్నల్ ఫ్రీగా ఎల్బీనగర్.. కూడలికి శ్రీకాంతాచారి పేరు : కేటీఆర్
-
Crime News
Hyderabad: విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
-
General News
Rahul Gandhi: ‘సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ డెమోక్రసీ’.. ఓయూలో నిరసన ర్యాలీ
-
India News
Sukesh- Jacqueline: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచి సుకేశ్ మరో ప్రేమ లేఖ