Lokesh kanagaraj: తలైవా చిత్రం ఏప్రిల్‌ నుంచి

తమిళ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌, హిట్‌ చిత్రాల దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో ‘తలైవర్‌ 171’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం తెరకెక్కనుందని ఈమధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలున్నాయి.

Updated : 20 Dec 2023 11:22 IST

తమిళ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌, హిట్‌ చిత్రాల దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో ‘తలైవర్‌ 171’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం తెరకెక్కనుందని ఈమధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు శుభవార్త వినిపించారు లోకేశ్‌. మంగళవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇందులో శివకార్తికేయన్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు స్పష్టం చేశారు. ‘స్క్రిప్ట్‌వర్క్‌ పూర్తైంది. చాలా ఏళ్ల తర్వాత రజనీ సార్‌ ఇందులో పూర్తిస్థాయిలో యాక్షన్‌ చేయనున్నారు. మా కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్టు మొదలవుతుందని తెలియగానే కమల్‌ సర్‌ మొట్టమొదట ఫోన్‌ చేసి గుడ్‌లక్‌ చెప్పారు’ అంటూ వివరాలు వెల్లడించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని