Macherla Niyojakavargam: ధర్మ స్థాపనే ధ్యేయంగా..

‘‘మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటానికి నా సమాధిని పునాదిగా వెయ్యడానికి నేను సిద్ధం’’ ...

Updated : 27 Jul 2022 11:02 IST

‘‘మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటానికి నా సమాధిని పునాదిగా వెయ్యడానికి నేను సిద్ధం’’ అంటున్నారు కథానాయకుడు నితిన్‌(Nithiin). ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించారు. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కృతి శెట్టి (Krithi Shetty), కేథరిన్‌ (Catherine) కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వంలో భాగంగా మంగళవారం ‘మాచర్ల ధమ్కీ’ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఓ శక్తిమంతమైన సంభాషణతో పాటు చిన్న యాక్షన్‌ బిట్‌ను చూపించారు. నితిన్‌ ఇందులో సిద్ధార్థ్‌ రెడ్డి అనే ఐఏఎస్‌ అధికారిగా, మాస్‌ లుక్‌తో సరికొత్తగా కనిపించారు. ‘‘ఇదొక పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా. చిత్ర ట్రైలర్‌ను ఈనెల 30న గుంటూరులో విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. సంగీతం: మహతి స్వరసాగర్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని