Macherla Niyojakavargam: మారిన విడుదల తేది

నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల తేదీ మారింది. జులై 8న విడుదల కావల్సిన ఆ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు

Updated : 09 May 2022 14:06 IST

నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల తేదీ మారింది. జులై 8న విడుదల కావల్సిన ఆ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయకుడు నితిన్‌... సిద్ధార్థ్‌ రెడ్డి అనే యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఆయనకి జోడీగా కృతిశెట్టి, కేథరిన్‌ నటిస్తున్నారు. ఎం.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు. ‘‘యాక్షన్‌ వినోదంతో రూపొందుతున్న చిత్రమిది. మునుపెన్నడూ చూడని రీతిలో విభిన్నమైన యాక్షన్‌ లుక్‌తో సందడి చేస్తారు నితిన్‌. ప్రస్తుతం ఇటలీ, ఆస్ట్రియాల్లో పాటల చిత్రీకరణ జరుగుతోంద’’ని తెలిపాయి సినీ వర్గాలు. ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్‌, సంభాషణలు: మామిడాల తిరుపతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని