Sudheer Babu: మామా మశ్చీంద్ర

సుధీర్‌బాబు కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై ఓ చిత్రం తెర  కెక్కుతోంది. హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణదాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మాతలు. తెలుగు,

Updated : 12 May 2022 09:02 IST

సుధీర్‌బాబు కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై ఓ చిత్రం తెర  కెక్కుతోంది. హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణదాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మాతలు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘మామా మశ్చీంద్ర’ అనే పేరుని ఖరారు చేశారు. బుధవారం సుధీర్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా పేరుని ప్రకటించడంతోపాటు, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అందులో సుధీర్‌బాబు ఓ రాక్‌స్టార్‌లా కనిపిస్తున్నారు. ‘‘సవాళ్లతో కూడిన పాత్రలో నటిస్తున్నారు సుధీర్‌బాబు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. మశ్చీంద్ర అనే పదానికి ధైర్యవంతుడు, పవర్‌ని కోరుకునేవాడని అర్థం. కథ, పాత్రలకి తగ్గట్టుగా పేరు పెట్టాం. తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రహణం: పి.జి.విందా, కళ: రాజీవ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని