‘జాతిరత్నాలు’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది

నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కలిసి నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌, స్వప్నా మూవీస్‌ కలిసి నిర్మించాయి.

Published : 25 Mar 2021 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కలిసి నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌, స్వప్నా మూవీస్‌ కలిసి నిర్మించాయి. నాగ్‌ అశ్విన్‌ నిర్మాత. ఫరియా అబ్దుల్లా కథానాయిక. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘మన జాతిరత్నాలు’ టైటిల్‌ ఫుల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. ‘‘సు సూడు హీరోలు.. ఒట్టి బుడ్డర్ ఖానులు.. వాల్యూ లేని వజ్రాలు మన జాతిరత్నాలు..ఈ సుట్టు పదుర్లు లేరే ఇట్లాంటోళ్లు.. వీళ్లయినా పుట్టాలంటే ఇంకో వందేళ్లు.. శాటిలైటుకైనా చిక్కరు వీల్లొ గల్లీ రాకెట్లు’’ అంటూ సాగిన ఈ పాట యువతను ఆకట్టుకుంది. ఈ పాటకి కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. రధన్‌ సంగీతం అందించారు. నవ్వులతో మురిపిస్తున్న ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. చిత్రంలో నరేష్‌, బ్రహ్మాజీ, మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని