thandel: వేగంగా తండేల్‌ ప్రయాణం

ఈసారి గురి తప్పేదేలేదంటూ ‘తండేల్‌’ ప్రపంచాన్ని ఓ ప్రచార చిత్రంతో ఆవిష్కరించాయి సినీ వర్గాలు. నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ వేగంగా సాగుతోంది. సముద్రం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కర్ణాటక,  గోవా తదితర ప్రాంతాల్లో ఇటీవల కొన్ని పోరాట ఘట్టాల్ని, టాకీ భాగాన్ని చిత్రీకరించారు.

Updated : 01 Feb 2024 09:27 IST

ఈసారి గురి తప్పేదేలేదంటూ ‘తండేల్‌’ ప్రపంచాన్ని ఓ ప్రచార చిత్రంతో ఆవిష్కరించాయి సినీ వర్గాలు. నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ వేగంగా సాగుతోంది. సముద్రం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కర్ణాటక,  గోవా తదితర ప్రాంతాల్లో ఇటీవల కొన్ని పోరాట ఘట్టాల్ని, టాకీ భాగాన్ని చిత్రీకరించారు. నెల రోజులకిపైగా సాగిన ఈ షెడ్యూల్‌లో నాగచైతన్య, సాయిపల్లవితోపాటు, ఇతర తారాగణం పాల్గొన్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా... భారత్‌, పాకిస్థాన్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య ఇందులో విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శ్యామ్‌దత్‌ ఛాయాగ్రాహకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని