Devil: ‘డెవిల్’ ఆగమనం ఆలస్యం?.. అనుకున్న తేదీకి రావట్లేదా?

కల్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం ‘డెవిల్‌’ (Devil). ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Published : 01 Nov 2023 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కల్యాణ్ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా నవీన్‌ మేడారం రూపొందించిన చిత్రం ‘డెవిల్‌’ (Devil). ‘బింబిసార’ (Bimbisara)తో విజయాన్ని అందుకున్న కల్యాణ్‌రామ్ అదే జోష్‌తో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. అయితే, ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. మొదట ఈ సినిమాను నవంబర్‌ 24న విడుదల చేయాలని భావించారు. అయితే,  కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

మరోసారి వాయిదాపడ్డ ‘ఆదికేశవ’.. కారణమిదే!

ప్రకటించిన దగ్గర నుంచి వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం..ఇప్పుడీ వాయిదాతో మరోసారి హైలైట్ అవుతోంది. ‘మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘డెవిల్’ అనుకున్న సమయానికి రావడం లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్, వీఎఫ్‌ఎక్స్‌ పనుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీని కారణంగా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్నాయి. అందువల్లే సినిమాను వాయిదా వేయాల్సివచ్చింది. మీ అందరికీ అద్భుతమైన అనుభవాన్ని ఇవ్వడానికి మా టీమ్ అంతా నిరంతరం కృషి చేస్తుంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ సరసన సంయుక్తా మేనన్‌ అలరించనుంది. ఎవరికీ అంతు చిక్కని రహస్యాన్ని ఛేదిస్తూ ఓ బ్రిటిష్‌ ఏజెంట్‌ చేసే ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. ఆ ఏజెంట్‌ పాత్రలో కల్యాణ్‌రామ్‌ కనిపించనున్నారు. ఇప్పటికే విడులైన పోస్టర్లు ప్రేక్షకాదరణ పొందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని