Nayanthara: నయన్‌ ‘గాడ్‌’

నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో అహ్మద్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఇరైవన్‌’. సుధన్‌ సుందరం, జి.జయరామ్‌ సంయుక్తంగా నిర్మించారు.

Updated : 25 Sep 2023 13:58 IST

నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో అహ్మద్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఇరైవన్‌’. సుధన్‌ సుందరం, జి.జయరామ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా తెలుగులో ‘గాడ్‌’ పేరుతో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో నయన్‌, జయం రవి సీరియస్‌ లుక్స్‌లో ఆసక్తికరంగా కనిపించారు. ‘‘విభిన్నమైన సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠతభరితంగా సాగుతుంది’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాని ఈనెల 28న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. తెలుగులోనూ ఇదే తేదీకి విడుదల చేస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, ఛాయాగ్రహణం: హరి కె.వేదాంతం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని