Kisi Ka Bhai Kisi Ki Jaan: ‘ఏంటమ్మా’... లుంగీ డ్యాన్సా!

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan), తెలుగు కథానాయకులు వెంకటేష్‌ (venkatesh), రామ్‌చరణ్‌ (Ram Charan) కలిసి ఆడిపాడి అభిమానులకు కనులపండుగ చేశారు. సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. పూజా హెగ్డే కథానాయిక.

Updated : 05 Apr 2023 06:55 IST

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan), తెలుగు కథానాయకులు వెంకటేష్‌ (Venkatesh), రామ్‌చరణ్‌ (Ram Charan) కలిసి ఆడిపాడి అభిమానులకు కనులపండుగ చేశారు. సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. పూజా హెగ్డే కథానాయిక. వెంకటేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఏంటమ్మా’ అంటూ సాగే పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటలో తళుక్కున మెరిశారు రామ్‌చరణ్‌. ఇందులో సల్మాన్‌, వెంకటేష్‌తో కలిసి చరణ్‌ లుంగీ డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు, హిందీ సాహిత్యాల కలబోతగా సాగే ఈ పాటలో ముగ్గురు హీరోలు ఒకే రకమైన చొక్కా, లుంగీలతో ప్రత్యేకంగా కనిపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘బతుకమ్మ’ పాటకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫర్హాద్‌ సామ్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈద్‌ సందర్భంగా విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని