Nithin: భీష్మ తర్వాత మళ్లీ!
నితిన్ (Nithin), రష్మిక (Rashmika) జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కింది. ‘భీష్మ’ లాంటి హిట్ తర్వాత ఈ ముగ్గురి కలయిక నుంచి వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
నితిన్ (Nithin), రష్మిక (Rashmika) జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కింది. ‘భీష్మ’ లాంటి హిట్ తర్వాత ఈ ముగ్గురి కలయిక నుంచి వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టగా.. బాబీ కెమెరా స్విచ్చాన్ చేశారు. గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి, బుచ్చిబాబు స్క్రిప్ట్ అందించారు. వినోదాత్మకంగా సాగే అడ్వెంచరస్ చిత్రమిది. ఈ సినిమాకి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్.
‘రేవ్ పార్టీ’లో ఏం జరిగింది?
క్రిష్ సిద్దిపల్లి హీరోగా రాజు బొనగాని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రేవ్ పార్టీ’. బొనగాని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అభిషేక్ నామా క్లాప్ కొట్టగా.. వంశీ, శశికిరణ్ తిక్కా, లక్ష్మణ్ సంయుక్తంగా స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజు మాట్లాడుతూ.. ‘‘రేవ్ పార్టీలలో యువత ఎలా ప్రవర్తిస్తుంటారు.. ఇలాంటి పార్టీల వల్ల వాళ్ల జీవితంలో ఎలాంటి మలుపులు వస్తాయి అనే అంశాల్ని ఈ చిత్రంలో చర్చించాం. వచ్చే నెల 3నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి, ఛాయాగ్రహణం: వెంకట్ మన్నం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్లో రకుల్
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/06/2023)