‘ఆ సినిమాలోకి నన్నెందుకు తీసుకోలేదు’: ‘ఛత్రపతి’ నటి అసహనం

బాలీవుడ్‌లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘డ్రీమ్‌గర్ల్‌ 2’ (Dream Girl 2)లో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై నటి అసహనం వ్యక్తం చేశారు.

Updated : 18 Aug 2023 15:10 IST

ముంబయి: ‘డ్రీమ్‌గర్ల్‌’ (Dream Girl) తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ బ్యూటీ నుష్రత్‌ బరుచా (Nushrratt Bharuccha). ఇటీవల ‘ఛత్రపతి’ (హిందీ వెర్షన్‌)లో నటించిన ఆమె త్వరలో ‘అకేలీ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘డ్రీమ్‌గర్ల్‌’కు సీక్వెల్‌గా రానున్న ‘డ్రీమ్‌గర్ల్‌-2’ (Dream Girl2)లో తాను భాగం కాకపోవడంపై మాట్లాడారు.

‘‘డ్రీమ్‌గర్ల్‌’లో నేను కథానాయికగా నటించా. ఆ చిత్రబృందం అంటే నాకెంతో ఇష్టం. వాళ్లతో కలిసి వర్క్‌ చేయడాన్ని ఎంతగానో మిస్‌ అవుతున్నా. ‘డ్రీమ్‌గర్ల్‌ -2’లో నాకెందుకు ఛాన్స్‌ ఇవ్వలేదో తెలియదు. ఈ ప్రశ్నకు చిత్రబృందం మాత్రమే సమాధానం చెప్పగలదు. నాకు అవకాశం ఇవ్వనందుకు ఎంతో బాధపడుతున్నా. విషయం ఏదైనా సరే తమకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగే, నాక్కూడా ఈ విషయం గురించి బాధపడే హక్కు ఉంది. ఆ బాధ చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది’’ అని ఆమె తెలిపారు.

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌ను కలిసిన రామ్‌చరణ్‌.. కారణమేమిటంటే?

ఆయుష్మాన్‌ ఖురానా (Ayushmann Khurrana) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘డ్రీమ్‌గర్ల్‌’. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్‌గా ‘డ్రీమ్‌గర్ల్‌-2’ సిద్ధమైంది. అనన్యాపాండే కథానాయిక. రాజ్‌ శాండిల్యా దర్శకుడు. ఆగస్టు 25న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున నుష్రత్‌ నటించిన ‘అకేలీ’ కూడా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని