Oscar Awards 2024: సత్తాచాటిన ఓపెన్‌ హైమర్‌.. అట్టహాసంగా ఆస్కార్‌ వేడుక

Oscar Awards 2024: అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఆస్కార్‌ సినీ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది.

Updated : 11 Mar 2024 10:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఆస్కార్‌’ (Oscars 2024) అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో  ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘ఓపెన్‌హైమర్‌’ (Oppenheimer) సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడితో సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ‘పూర్‌ థింగ్స్‌’ కూడా తన హవా కొనసాగించి కొన్ని కేటగిరిల్లో ఆస్కార్‌ను గెలుపొందింది.

ఇప్పటివరకు ప్రకటించిన అవార్డులు..

  • ఉత్తమ చిత్రం: (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ దర్శకుడు : క్రిస్టఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ నటుడు: కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ నటి: ఎమ్మాస్టోన్‌ (పూర్‌ థింగ్స్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ సహాయ నటి: డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్‌హైమర్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌
  • బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
  • బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
  • బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
  • ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
  • బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
  • ఉత్తమ ఎడిటింగ్‌: జెన్నిఫర్‌ లేమ్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: గాడ్జిల్లా మైనస్‌ వన్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌): ది లాస్ట్‌ రిపేర్‌ షాప్‌
  • ఉత్తమ ఒరిజినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: ఓపెన్‌హైమర్‌
  • ఉత్తమ సౌండ్‌ : ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌ 
  • ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌:  వాట్‌ వాస్ ఐ మేడ్‌ ఫర్‌ ( బార్బీ)
  • లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది వండర్‌ఫుల్‌ స్టోరీ ఆఫ్‌ హెన్రీ సుగర్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు