OG: ‘ఓజీ’ని ఢీకొట్టే ఓమి

పవన్‌ కల్యాణ్‌ - సుజీత్‌ కలయికలో వస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక.

Updated : 25 Mar 2024 09:24 IST

పవన్‌ కల్యాణ్‌ - సుజీత్‌ కలయికలో వస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అందులో ఆయన పొడవాటి జుట్టు.. కనుబొమ్మపై కత్తిగాటుతో ఆసక్తికరంగా కనిపించారు. తనిందులో ఓమి భావు అనే పాత్ర పోషిస్తున్నట్లు ఆ ప్రచార చిత్రంతో స్పష్టత ఇచ్చారు. ఈ సినిమాలో ఓజీకి ఓమికి మధ్య జరిగే ఘర్షణను ఊహించలేమంటూ చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చింది. ఇది ఇమ్రాన్‌కు తెలుగులో తొలి చిత్రం. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని