Rahul Sipligunj: రాజకీయాల్లోకి ఎంట్రీ.. రాహుల్‌ సిప్లిగంజ్‌ క్లారిటీ

తన పొలిటికల్‌ ఎంట్రీ గురించి జరుగుతోన్న ప్రచారంపై గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj) స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

Published : 26 Aug 2023 13:59 IST

హైదరాబాద్‌: యువ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj) రాజకీయాల్లోకి రానున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీ తరఫున గోషామహల్‌ నుంచి ఆయన పోటీ చేయనున్నారంటూ ప్రచారం సాగింది. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. సంగీత రంగంలోనే కొనసాగాలనుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

Allu Arjun: అల్లు అర్జున్‌ ప్రైవేట్‌ పార్టీ.. ఫొటోలు వైరల్‌

‘‘నేను రాజకీయాల్లో రావడం లేదు. రానున్న ఎన్నికల్లో గోషామహల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నానంటూ గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ అవాస్తవాలు మాత్రమే. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఒక ఆర్టిస్ట్‌గా జీవితాంతం ప్రతిఒక్కరికీ వినోదాన్ని అందించాలనుకుంటున్నా. సంగీత రంగంలోనే కొనసాగుతూ.. పరిశ్రమకు మరింత సేవ చేయాలనుకుంటున్నా. నన్ను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదు. కాబట్టి దయచేసి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకండి’’ అని ఆయన స్పష్టం చేశారు. గాయకుడిగా కెరీర్‌ను మొదలుపెట్టిన రాహుల్‌.. ‘నాటు నాటు’తో అంతటా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆస్కార్‌ వేదిక పైన ‘నాటు నాటు’ పాటను ఆయన ఆలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని