Rajinikanth: రజనీ వేట

రజనీకాంత్‌ 170వ చిత్రం పేరు ఖరారైంది. తమిళంలో ‘వేట్టయాన్‌’ అనే పేరుని ఖరారు చేశారు. తెలుగు పేరేమిటనేది తెలియాల్సి ఉంది.  ‘జై భీమ్‌’ ఫేం టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో  ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Updated : 13 Dec 2023 09:29 IST

జనీకాంత్‌ 170వ చిత్రం పేరు ఖరారైంది. తమిళంలో ‘వేట్టయాన్‌’ అనే పేరుని ఖరారు చేశారు. తెలుగు పేరేమిటనేది తెలియాల్సి ఉంది.  ‘జై భీమ్‌’ ఫేం టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో  ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఓ ప్రత్యేకమైన ప్రచార చిత్రంతో పేరుని ప్రకటించారు. ఈ పేరుకి తెలుగులో ‘వేటగాడు’ అని అర్థం. మరి రజనీ వేట ఎలా సాగిందో  తెలియాలంటే చిత్రం విడుదల వరకూ ఆగాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని